![]() |
![]() |

స్టార్ మా చానల్‌లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం' సీరియల్‌లో వచ్చే వంటలక్క ఎంత ఫేమస్సో అందరికి తెలిసిందే. ఈ పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్ స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. త్వరలో సినిమాల్లోనూ కనిపించబోతోంది. ఈ సీరియల్ ప్రేమికి సినిమాల్లో నటించే అవకాశాన్ని తెచ్చి పెట్టింది.. అంతలా పాపులర్ అయిన వంటలక్కకు పోటీగా పాటలక్క రాబోతోంది.
జీ తెలుగు కోసం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు 'కృష్ణ తులసి' పేరుతో ఓ సీరియల్‌ని ప్రారంభిస్తున్నారు. వంటలక్క తరహాలోనే నలుపు రంగుతో డీ గ్లామర్ పాత్రలో వుండే శ్యామ కథని బుల్లితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇందులో శ్యామ పాటలక్కగా కనిపించబోతోంది. ఇచ్చిన మాట కోసం తన గొంతుని సవతి తల్లి కూతురికి అరువిచ్చి సవతి తల్లి చేతుల్లో అవమానాలు పడే పాత్రలో శ్యామ కనిపించబోతోంది.
ఇటీవల విడుదలైన ఈ సీరియల్ ప్రోమో చూసిన వారంతా వంటలక్క తరహాలోనే శ్యామ కూడా పాటలక్కగా పాపులర్ కావడం గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు. "వంటలక్క.. చెల్లి పాటలక్క" అంటూ మీమ్స్ ని వైరల్ చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి పాటలక్క సీరియల్ 'కృష్ణ తులసి' జీ తెలుగులో సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.
![]() |
![]() |